Dixit Shetty: ఆ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాము.. దెబ్బలు తగిలిన లెక్కచేయలేదు.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’.

Dixit Shetty: ఆ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాము.. దెబ్బలు తగిలిన లెక్కచేయలేదు.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘నదివే నువ్వు నదివే’ అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుండగా మంచి స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీక్షిత్ శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘‘నదివే’ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ విశ్వకిరణ నంబితో కలిసి వారం రోజులు రీసెర్చ్ చేశాం. బాడీని కంట్రోల్స్ చేసుకుంటూ సౌండ్‌కు తగ్గట్టు మూమెంట్స్ చేయడం కష్టం. పైగా లైవ్ షోలో ఇలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చేటప్పుడు చిన్న పొరపాటు జరిగితే లైట్ తీసుకుంటారేమో కానీ బిగ్ స్క్రీన్‌పై అలా కాదు. అందులో ఈ సాంగ్ పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం చాలా కష్ట పడ్డాము. ప్రాక్టీస్ చేసే టైమ్‌లో నాకు, రష్మికకు చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలాయి. కొత్తది నేర్చుకునేందుకు ఇదో మంచి అవకాశమని ఓ నటుడిగా భావించి ముందుకు వెళ్లా. అలాగే ఈ పాట రిలీజ్ అయ్యాక ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. మా కష్టం మొత్తం మర్చిపోయా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story