- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగళవారం మూవీతో పాపులర్..ఈ అందాల తార బ్యాక్ గ్రౌండ్ ఇదే
మంగళవారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన నటి దివ్యా పిళ్లై, తెలుగులో తగ్గేదేలే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద సముద్రం. ఇందులో ఎంతో మంది నటి మనులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం చిన్న పాత్ర పడినా సరే, వైరల్ అయిపోతూ ఉంటారు. అందరికీ గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి దివ్యా పిళ్లై ( Divya Pillai) ఒకరు. తెలుగు ప్రేక్షకులను మంగళవారం ( Mangalavaaram) అనే సినిమాతో కత్తి పడేశారు దివ్యా పిళ్లై. ఈ సినిమాలో చాలా ఇన్నోసెంట్ గా కనిపించిన నటి దివ్యా పిళ్లై... చివరికి ఆమె ఇచ్చే ట్విస్ట్ కు థియేటర్ లో ఉన్న ప్రేక్షకులు అందరూ కుదేలు అయిపోతారు. జమీందారు భార్యగా నటించి, ఇండస్ట్రీని షేక్ చేసేసారు. అయితే అలాంటి నటి దివ్యా పిళ్లై గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో దివ్యా పిళ్లై బ్యాక్ గ్రౌండ్ గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు.
నటి దివ్యా పిళ్లై బ్యాక్ గ్రౌండ్ ఇదే
మంగళవారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన నటి దివ్యా పిళ్లై, తెలుగులో తగ్గేదేలే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2022లో ఈ తగ్గేదేలే సినిమా వచ్చింది. ఇందులో నవీన్ చంద్ర సరసన కథానాయకగా మెరిశారు. ఈ సినిమా తర్వాత మంగళవారం చేసిన ఆమె, గత ఏడాది భైరవం సినిమాలో కూడా సందడి చేశారు. ఇక ఇప్పుడు హనీ ( Honey Movie ) అనే సినిమాతో ప్రేక్షకులను భయపట్టించేందుకు వస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి ఆరవ తేదీన రిలీజ్ కాబోతోంది. సైకలాజికల్ హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ రోల్ చేస్తున్నారు నటి దివ్యా పిళ్లై ( Divya Pillai) . కాగా దివ్యా పిళ్లై మలయాళ నటి అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. హనీ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. కాగా ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా చేస్తున్నారు.






