గ్లామర్ డోస్ పెంచిన దివ్య భారతి.. హాట్ ఫోజులతో సందడి!

by Pulgam srinivas |

హాట్ లుక్స్‌తో హీట్ పెంచిన దివ్య భారతి.. వైరల్ అవుతున్న ఫోటోలు

గ్లామర్ డోస్ పెంచిన దివ్య భారతి.. హాట్ ఫోజులతో సందడి!
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమె జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం బ్యాచిలర్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది.




ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందుతున్న గోట్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయినప్పటికీ ఇంకా విడుదల కాలేదు.




సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈమె ఎన్నోసార్లు వెండితెరపై కుర్రకారికి హీట్ పెంచింది. తాజాగా దివ్య భారతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.




ఆ ఫోటోలలో ఈమె బ్లూ జీన్స్ ప్యాంట్, స్కై బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి, తన నడుము అందాలు హైలైట్ అయ్యేలా స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది. అలాగే గాలికి వదిలేసిన కురులు, మెడలో ధరించిన చైన్ ఈమె అందాన్ని మరింతగా పెంచాయి.




మొత్తంగా ఈ ఫోటోలలో దివ్య భారతి తన కిల్లింగ్ స్మైల్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story