Divya bharathi: డబ్బింగ్ సినిమాతో తెలుగులో క్రేజ్.. కట్ చేస్తే టాలీవుడ్‌లో అలాంటి అనుభవం

by Pulgam srinivas |

Divya Bharathi: బ్యాచిలర్ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న దివ్య భారతి ఆ తర్వాత గోట్ అనే తెలుగు చిత్రాన్ని ప్రారంభించింది. చాలా రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు.

Divya bharathi: డబ్బింగ్ సినిమాతో తెలుగులో క్రేజ్.. కట్ చేస్తే టాలీవుడ్‌లో అలాంటి అనుభవం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో అనేక సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు డబ్బింగ్ సినిమా రావాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఓటీటీ ట్రెండ్ వచ్చాక చాలా ఈజీగా ఇతర భాషల సినిమాలు తెలుగులోకి వచ్చేస్తున్నాయి. దానితో కొంతమందికి డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా మంచి గుర్తింపు దక్కుతుంది. అలా డబ్బింగ్ సినిమా ద్వారా రీసెంట్ టైంలో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దివ్య భారతి ఒకరు.

ఈమె ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయినటువంటి జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన బ్యాచిలర్ అనే మూవీతో మంచి విజయాన్ని, గుర్తింపును దక్కించుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా ఇదే టైటిల్ తో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రం ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా స్టార్ట్ అయిన గోట్ చిత్రంలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. మొదట్లో ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగింది, దాంతో ఈ చిత్రం నుండి కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేశారు.

అంతా సజావుగా జరుగుతుంది అనుకునే లోపు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్లు రావడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అని చాలామందిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా గనుక విడుదల కాకపోయినా, రిలీజ్ అయ్యి పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈమె కెరియర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంత సజావుగా ముందుకు సాగడం కష్టం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Next Story