Divya Agarwal: ఆ వీడియో తలుచుకుంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది.. పూనమ్ పాండే వైరల్ బోల్డ్ వీడియోపై దివ్వ అగర్వాల్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-07-21 11:02:18  IST  )

బాలీవుడ్ బ్యూటీస్ దివ్య అగర్వాల్, పూనమ్ పాండే వీడియో ఒకటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Divya Agarwal: ఆ వీడియో తలుచుకుంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది.. పూనమ్ పాండే వైరల్ బోల్డ్ వీడియోపై దివ్వ అగర్వాల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీస్ దివ్య అగర్వాల్, పూనమ్ పాండే వీడియో ఒకటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దివ్య అగర్వాల్ పుట్టినరోజు వేడుకల్లో మీడియా వాళ్లకు ఫొటోస్ ఇస్తున్న క్రమంలో.. దివ్య, పూనమ్ పాండేను ఎత్తుకుని ఇటు నుంచి అటు తిప్పింది. ఈ క్రమంలోనే పూనమ్ పాండే డ్రెస్ పైకి వెళ్లడంతో బ్యాక్ మొత్తం కనిపించేసింది. అదే సమయంలో పూనమ్ పాండే మీడియా వాళ్లకు ఆ క్లిప్ డిలీట్ చేయాలంటూ కోరింది కూడా. అయిన దానికి సంబంధించిన వీడియో క్లిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

దీనిపై రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య అగర్వాల్ దానికి నేను చాలా సిగ్గు పడుతున్న అంటూ చెప్పుకొచ్చింది. ‘పూనమ్‌ను పక్కకు తిప్పి మీడియా దృష్టిని తప్పిందాం అనే ఉద్దేశ్యంతో అలా చేశాను. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. కానీ పూనమ్ మాత్రం ఆ క్లిప్ డిలీట్ చేయాలంటూ మీడియాను రిక్వెస్ట్ చేసి. ఇక తర్వాత అసలు విషయం తెలిసి నేను వెంటనే తనకు మెసేజ్ చేసి సారీ చెప్పాను. కానీ, పూనమ్ మాత్రం ‘అది నువ్వు కావాలని చేసింది కాదు.. పర్వాలేదు లైట్ తీసుకో’ అని తెలిపింది. పూనమ్ కాబట్టి అంత కూల్‌గా రియాక్ట్ అయింది. అదే వేరే ఏవరైనా అయుంటే.. వారు దానితో పెద్ద ఒప్పందం కుదుర్చుకునేవారు. కానీ పూనమ్ నాపై చాలా దయతో ప్రవర్తించింది. అయితే.. ఆ విషయం గుర్తుకొచ్చిన ప్రతీసారి నేను చేసిన పనికి చాలా సిగ్గుపడతాను’ అంటూ చెప్పుకొచ్చింది దివ్య అగర్వాల్.

Next Story