- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Premaku Jai: యాదార్థ సంఘటనల ఆధారంగా న్యూ లవ్ స్టోరీ..
ఓ గ్రామీణ నేపథ్యం(Rural background)లో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ప్రేమకు జై'

దిశ, సినిమా: ఓ గ్రామీణ నేపథ్యం(Rural background)లో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ప్రేమకు జై' (Premaku Jai). ఇందులో అనిల్ బురగాని, ఆర్ జ్వలిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్‌లలో విడుదల అవుతోంది. ఇప్పటి వరకు తెరపై చూడని ఓ లవ్ స్టోరీ(love story)ని చూపించబోతున్నట్టు ఇప్పటికే చిత్రం బృందం ప్రకటించగా.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈక్రమంలోనే ‘ప్రేమకు జై’ చిత్రాన్ని మరింతగా ఆడియన్స్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు చిత్ర బృందం.
ఈ సందర్భంగా దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ... ‘పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్రవారం థియేటర్‌లలో విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.






