- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Jack' sequels: ‘జాక్’ సీక్వె్ల్స్ కూడా ఉన్నాయి.. డైరెక్టర్ ఆన్సర్‌కు నెటిజన్ల రియాక్షన్ చేస్తే షాక్ అవుతారు

దిశ, సినిమా: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) త్వరలో ‘జాక్’ (Jack) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మోస్ట్ వెయిటెడ్ (Most weighted) మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తుంది. యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ‘జాక్’ నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి.
ఇప్పుడు ఇదే జోష్‌లో తాజాగా ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు చిత్ర బృందం. మూడు నిమిషాల ఏడు సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయినా ఈ ట్రైలర్‌లో సిద్ధు ఎప్పటిలాగే తన కామెండీ టైమింగ్ (Comedy timing)తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిత్ర బృందం జాక్ సీక్వెల్‌పై కూడా అప్‌డేట్ ఇచ్చారు. ‘డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్ వచ్చినట్లు జాక్‌కి జాక్ స్క్వేర్ వస్తుందా’ అనే ప్రశ్నకు డైరెక్టర్ స్పందిస్తూ.. ‘తీద్దాం అనే అనుకుంటున్నాను. కథ కూడా రాసిపెట్టాను. చూద్దాం. అదే ఎలా ఉంటుంది అంటే.. జాక్ (Jack), జాక్ ప్రో (Jack Pro), జాక్ ప్రో మాక్స్ (Jack Pro Max) ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.