- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vashishtha :టీజర్‌ను కావాలనే టార్గెట్ చేశారు.. ట్రైలర్‌తో ఆన్సర్ ఇస్తా.. విశ్వంభర డైరెక్టర్ కామెంట్స్
మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న లేటెస్ట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’.

దిశ, సినిమా: మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న లేటెస్ట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఇందులో త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. ప్రేక్షకుల్లో ‘విశ్వంభర’ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ వశిష్ట సినిమాను ట్రోల్స్ చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘విశ్వంభర’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసినప్పుడు కొంతమంది కావాలనే టార్గెట్‌గా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. వాళ్లందరికి నేను ట్రైలర్‌తో ఆన్సర్ ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌లో మరింత బూస్ట్‌ను నింపాయి.






