బుర్రలేని డైరెక్టర్స్ కారణంగానే నేను డైరెక్టర్ అయ్యా.. వైరల్‌గా దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తేజ.

బుర్రలేని డైరెక్టర్స్ కారణంగానే నేను డైరెక్టర్ అయ్యా.. వైరల్‌గా దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తేజ. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ డైరెక్టర్.. సినిమా ఇండస్ట్రీలో కొందరు ప్రతిభ లేని దర్శకులతో పని చేయడం కారణంగానే నేను దర్శకుడిని అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘కొందరు మహామహులతో పాటు.. కనీస ప్రతిభ.. పట్టుదల లేని కొందరు దర్శకుల వద్ద కూడా నాకు పనిచేశాను. సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆ దర్శకులకు సినిమా నాణ్యతపై ఎలాంటి శ్రద్ధ ఉండేది కాదు. ఏది పడితే అది తీసేసి ఎలాగోలా సినిమాను ముగించేద్దామనే ధోరణిలో వాళ్లు ఉండేవారు. సెట్స్‌లో దర్శకులకు ఉన్న ఆ నిర్లక్ష్యమే నన్ను డైరెక్టర్ కుర్చీ వైపు నడిపించింది. వాళ్లు సరిగ్గా చేయని, వదిలేసి వెళ్లిన కొన్ని సీన్స్‌కు నేను దర్శకత్వం వహించేవాడిని, అలా సినిమాల బాధ్యత అంతా నా భుజాలపై పడటం... ఆ తర్వాత ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం నాకు ఆశ్చర్యం క‌లిగించేది.. అలా నేను దర్శకుడిని అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు తేజ.

Next Story