- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sukumar: పట్టణ ప్రజలు కంటే గ్రామాల్లో వాళ్లు బెటర్.. డైరెక్టర్ సుకుమార్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ (Sukumar) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ (Sukumar) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా.. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో మూవీ రాబోతున్నట్లు తెలిపి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చారు సుకుమార్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన తన స్వగ్రామమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని మట్టపుర్రుకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడ గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపిన సుకుమార్ అనంతం మీడియాతో ముచ్చటిస్తూ గ్రామ ప్రజలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘సినిమాపై ప్రేక్షకుల ఇష్టాలు మారలేదు. అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉంది. అయితే.. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు సినిమాలను ఎక్కువగా థియేటర్లకు వెళ్లి చూసి ఆదరిస్తున్నారు. పట్టణ ప్రేక్షకులు కొంత భాగం ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్స్ పట్ల ఆకర్షితులు అవుతూ థియేటర్స్‌కు వెళ్లడం లేదు’ అని చెప్పుకొచ్చారు. అలాగే.. ‘టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు.. అలాంటి వారి ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థల్ని స్థాపించాము. ఈ సంస్థల ద్వారా చాలా మంది ప్రోత్సాహం, టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
“People in villages are still going to theatres to watch movies, while in towns and cities, audiences are slowly moving towards OTT platforms.”
— Movies4u Official (@Movies4u_Officl) May 21, 2025
- #Sukumar pic.twitter.com/ZFRr8plXxv






