- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srikanth Odela: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగం.. క్యూరియాసిటీ పెంచేస్తున్న మిస్టీరియస్ లుక్
ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న వారిలో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఒకరు

దిశ, సినిమా: ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న వారిలో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఒకరు. నేచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయిన ఈయన ప్రజెంట్.. మళ్లీ నానితో చేతులు కలిపాడు. ఇప్పుడు వాళ్ల ఇద్దరి కాంబోలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) రాబోతుంది. దీనికి సంబంధించిన గ్లింప్స్ (Glimpses) కూడా రీసెంట్‌గా రిలీజ్ చెయ్యగా.. అందులో నానిని ఓ డిఫరెంట్ లుక్(Different look)లో చూపించి అందరిని షాక్‌కు గురిచేశాడు. అదే డైరెక్టర్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి (new experiment) సిద్ధం అయ్యాడు.
ఈ సినిమాకు ‘అల్ అమీనా జారియా రుక్సానా'స్ గులాబీ’ (Al Amina Zariya Ruksana's Rose) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసి దానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నల్ల చీర కట్టిన ఓ యువతి సరిహద్దు ప్రాంతంలో నడుస్తూ ఉండగా.. చుట్టూ ఎర్ర గులాబీలు గాలిలో ఎగురుతున్నట్లు చూపించారు. ఈ మిస్టీరియస్ లుక్ సినిమా కథపై క్యూరియాసిటీ (Curiosity)ని పెంచుతోంది. కాగా.. 2009లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఓ యువతి త్రీవంగా ప్రేమిస్తే.. ఆ ప్రేమ తీవ్రత ఎలా ఉంటుందో అనే కోణంలో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘ఒక పోరి పోరడిలా ప్రేమిస్తే ఎలా ఉంటది?’ అనే క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రజెంట్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.
Fore More Movie News : https://www.dishadaily.com/movie






