తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న డైరెక్టర్ శంకర్..

by Chukka Sudharani |

ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్.. ప్రస్తుతం వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నాడు.

తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న డైరెక్టర్ శంకర్..
X

దిశ, సినిమా: ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్.. ప్రస్తుతం వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ‘వేల్పారి’ వంటి భారీ బడ్జెట్ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ప్రసిద్ధ తమిళ రచయిత సు.వెంటేశన్ రాసిన ‘వీర యుగ నాయగన్ వేల్ పారీ’ అనే నవల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకంగా మూడు భాగాల్లో ఒక భారీ హిస్టారికల్ ఎపిక్ మల్టీ-పార్ట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ కోలీవుడ్ సర్కిల్‌లో వినిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ ‘వేల్పారి’ స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఉత్కంఠభరితమైన యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్స్ తర్వాత ఆయన ప్రేక్షకులలో తనను తాను మరోసారి నిరూపించుకోవడానికి ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇది మామూలు భారీ కమర్షియల్ తరహా చిత్రంలా కాకుండా, పూర్తిగా భిన్నమైన, స్క్రీన్‌ప్లేకు ప్రాధాన్యతనిచ్చే యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని టాక్. ఈ స్టోరీ కోసం ప్రస్తుతం ఇద్దరు యువ హీరోలతో చర్చలు జరుగుతున్నాయని, ఈ థ్రిల్లర్ షూటింగ్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి, విడుదల చేసి, థియేటర్లలో భారీ విజయం సాధించి, ఆ తర్వాతే తన పూర్తి దృష్టిని ‘వేల్పారి’పై పెట్టాలని శంకర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని గట్టి సమాచారం.

Next Story