Spirit: సందీప్ రెడ్డి షాకింగ్ నిర్ణ‌యం..ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఇక జాత‌రే !

by velandi.Saikiran |

ప్రభాస్ హీరోగా చేస్తుండగా ట్రిప్టి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ జైలర్ పాత్రలో కనిపిం

Spirit: సందీప్ రెడ్డి షాకింగ్ నిర్ణ‌యం..ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఇక జాత‌రే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి లాంటి సినిమా చేసి ప్రపంచ స్థాయి హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఇక ఇప్పుడు ప్రభాస్ ఏ సినిమా చేసిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా ట్రిప్టి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ జైలర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా గురించి తాజాగా ఓ క్రేజ్ అప్డేట్ వ‌చ్చింది. స్పిరిట్ సినిమా కోసం తాజాగా సందీప్ రెడ్డి వంగా షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అత్య‌వ‌స‌రంగా న్యూయార్క్ ట్రిప్ కు సందీప్ రెడ్డి వంగా వెళ్లాల్సి వ‌చ్చింద‌ట‌. అయితే, స్పిరిట్ కోసం ఆ ట్రిప్ ర‌ద్దు చేసుకున్నాడని స‌మాచారం. జ‌న‌వ‌రి వ‌ర‌కు ఎలాంటి ట్రిప్ పెట్టుకోకుండా, స్పిరిట్ పైనే ఫోక‌స్ చేయ‌నున్నాడ‌ట సందీప్‌. 2027 సినిమాను రిలీజ్ చేసే వ‌ర‌కు నిద్ర పోబోన‌ని భీష్మించుకుని కుర్చుకున్నాడ‌ట‌.

Next Story