సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే, అమీర్‌పేటలో క‌ట్ డ్రాయ‌ర్‌పై తిరుగుతా!

by velandi.Saikiran |

రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai ).. ఈ సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో

సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే, అమీర్‌పేటలో క‌ట్ డ్రాయ‌ర్‌పై తిరుగుతా!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai ).. ఈ సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో జరిగిన ఓ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారట. నవంబర్ 21 అంటే రేపే ఈ సినిమా రిలీజ్ కానుంది. సాయి కంపాటి దర్శకత్వంలో ఈ మూవీ వస్తుండగా వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి సినిమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అఖిల్ రాజ్, తేజస్వీ రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చైతు జొన్నలగడ్డ, శివాజీ రాజా ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు తాజాగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయి కంపాటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పల్లెటూరు కథలు అంటేనే తనకిష్టమని, అలాంటి మాస్ సినిమాలకు జనాదరణ ఉంటుందన్నారు. దయచేసి తన సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినట్లు ప్రచారం చేయకండి అని కోరారు. నవంబర్ 21వ తేదీన సినిమా జనాలకు నచ్చకపోతే, నేనే అమీర్ పేట్ సెంటర్ లో క‌ట్ డ్రాయర్ మీద ఉరుకుతానంటూ సవాల్ చేశారు సాయి కంపాటి. క్లిక్

Next Story