సమంత సజెషన్ ఇచ్చింది.. అందుకే రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నాము.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కామెంట్స్

by Chukka Sudharani |

రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’.

సమంత సజెషన్ ఇచ్చింది.. అందుకే రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నాము.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కామెంట్స్
X

దిశ, సినిమా: రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. దీంతో తాజా ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ‘నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ఇన్స్‌పైర్ చేసింది. ఫస్ట్ ఇది ఓటీటీ కోసం అనుకున్నాము. అయితే కథను అల్లు అరవింద్ చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు.

రశ్మికకు స్క్రిప్ట్ పంపినప్పుడు చదివి చెప్తానంది. రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్‌గా చదివి కాల్ చేసింది. ఈ మూవీ మనం వెంటనే చేస్తున్నాం, ఇలాంటి కథ ఆడియెన్స్‌కు చెప్పాలి. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను. బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా అని చెప్పింది. నేను ఏ కథ రాసినా నా స్నేహితులు సమంత, వెన్నెల కిషోర్, అడివి శేష్, డైరెక్టర్ సుజీత్.. ఇలా కొంతమందికి పంపిస్తుంటా. అలా "ది గర్ల్ ఫ్రెండ్" కథ కూడా పంపాను. సమంతను ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుకున్నారనే వార్తలు వచ్చాయి. సమంత ఈ స్క్రిప్ట్ చదివాక, నేను కాదు మరొక హీరోయిన్ అయితేనే ఈ మూవీకి బాగుంటారని సజెషన్ ఇచ్చింది’ అని చెప్పాడు.

Next Story