- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Razakar:ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన తెలుగు సినిమా.. థ్రిల్‌గా ఉన్నానంటూ డైరెక్టర్ పోస్ట్
భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’(Razakar).

దిశ, సినిమా: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’(Razakar). దీనికి యాటా సత్యనారాయణ(Yata Satyanarayana) దర్శకత్వం వహించారు. అయితే ఇందులో బాబీ సింహా, అనసూయ(Anasuya), అన్ను శ్రియ త్రిపాతి, ఇంద్రజ(Indraja), వేదిక, ప్రేమ, మకరంద్ దేశ్ పాండే(Makarand Deshpande), రాజ్ అర్జున్(Raj Arjun), తేజ్ సప్రు, జాపన్ విజయ్, దేవీ ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ‘రజాకార్’ సినిమాకు ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలయింది.
నిజాం పాలనలో రజాకార్లు ఓ వర్గం వారిని టార్గెట్ చేస్తూ ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారనే అంశాలతో వచ్చిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు పలు వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అవన్నీ సర్దుమనిగాక.. గత ఏడాది మార్చి15న థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు సెలెక్ట్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘‘ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌కి మా చిత్రం ‘రజాకార్’ అధికారికంగా ఎంపికైందని తెలియజేసేందుకు థ్రిల్‌గా ఉన్నాను’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






