- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Director Om Raut: ధనుష్ కంటే మంచి నటుడిని నేను ఎక్కడా వెతకలేను.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న మరో ప్రాజెక్ట్ ‘కలాం’.

దిశ, సినిమా: డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న మరో ప్రాజెక్ట్ ‘కలాం’. భారతదేశపు మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ఎ.పి.జె. అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 2025 మేలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యగా.. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రాలేదు. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు.
‘‘కలాం బయోపిక్‌కి’ Dr. APJ అబ్దుల్ కలాం గారి పాత్ర పోషించడానికి ధనుష్ కంటే మంచి నటుడిని నేను ఎక్కడా వెతకలేను. ఆ పాత్రను ఆయనకన్నా బాగా చేయగల వ్యక్తి ఇంకొకరు లేరు. ఆ పాత్ర చేయడానికి ధనుష్ అంగీకరించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ఒక అద్భుతమైన నటుడు. నేను నిజంగా పని చేయడానికి ఇష్టపడే వ్యక్తి ఆయన. కలాం జీవితంలో ఏ భాగాన్ని ఎంచుకుని సినిమా చేయాలని అనేది ఒక పెద్ద సవాలు. కానీ నేను ఈ సినిమాను అందరికి స్ఫూర్తిదాయకంగా అందిస్తాను’ అని తెలిపారు. కాగా.. ఈ సినిమా ‘ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్‌తో తెరకెక్కుబోతుండగా.. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. లింక్






