- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త లవ్ స్టోరీతో వస్తోన్న హీరో నితిన్..ఈ సారి హిట్ పక్కానా ?
జబర్దస్త్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ ప్రాజెక్టులో ఛాన్స్ వస్తే వదులుకున్నాడట. త్వరలో లిటిల్ హార్ట్స్ దర్శకుడితో ఓ సినిమా

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ గురించి తెలియని వారు ఉండరు. జయం, దిల్ లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న హీరో నితిన్, రాజమౌళితో సై లాంటి సినిమాలు కూడా చేశారు. ఇక మధ్యలో గుండెజారి గల్లంతయిందే, ఇష్క్ , భీష్మ లాంటి సినిమాలతో మెరిసి, మళ్లీ డిజాస్టర్ హీరోగా మారిపోయాడు. ఎన్ని ప్రయోగాలు చేసిన హీరో నితిన్ సక్సెస్ అందుకోవడం లేదు. మొన్నటికి మొన్న తమ్ముడు, రాబిన్ హుడ్ లాంటి సినిమాలు చేసినప్పటికీ జనాలను ఆకట్టుకోలేకపోయాడు నితిన్.
ఇక అటు జబర్దస్త్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ ప్రాజెక్టులో ఛాన్స్ వస్తే వదులుకున్నాడట. త్వరలో లిటిల్ హార్ట్స్ దర్శకుడితో ఓ సినిమా కూడా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతలో నితిన్ వద్దకు మరో లవ్ స్టోరీ వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కొత్త లేడీ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నాడట. ఈ మూవీ కంప్లీట్ గా లవ్ స్టోరీ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నీరజ కోన ఇప్పటికే తెలుసు కదా అనే సినిమాతో మంచి మార్క్ వేసుకున్నారు. ఇప్పుడు నితిన్ తో ప్రయోగం చేయబోతున్నారు నీరజ కోన. మరి ఈ సినిమాతో అయినా హీరో నితిన్ హిట్ బాట పడతాడా? లేదా ? చూడాలి.






