- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే నేను అబ్బాయి గెటప్ లోనే ఉంటా : డైరెక్టర్ నందిని రెడ్డి
సమంత ప్రధాన పాత్రలో "అలా మొదలైంది" తో డెరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "మా ఇంటి బంగారం".

దిశ, వెబ్‌డెస్క్: సమంత ప్రధాన పాత్రలో "అలా మొదలైంది" తో డెరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "మా ఇంటి బంగారం". జూన్ 19వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథ, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే స్టోరీ కావడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. వీకెండ్ లో ప్రధాన నగరాల్లో సినిమా వేసిన అన్ని థియేటర్లు దాదాపు హౌస్ ఫుల్ అవ్వగా.. రెండోరోజూ మంచి కలెక్షన్లే వసూలు చేసింది. విడుదలైన రోజు రూ.13 కోట్లు రాగా..శనివారం రూ.15 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక ఆదివారం కూడా మంచి వసూళ్లే రావడంతో.. రిలీజైన మూడ్రోజులకే మా ఇంటి బంగారం మంచి కలెక్షన్లు రాబట్టింది. రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించగా.. మూడ్రోజుల్లోనే లాభాల బాట పట్టడంతో చిత్రయూనిట్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా డైరెక్టర్ విషయానికొస్తే.. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నందినిరెడ్డి తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెనయ్యారు. తన పెళ్లి, డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఎప్పుడూ అబ్బాయిలా కటింగ్ చేయించుకోవడానికి కారణం.. తనది కర్లీ హెయిర్ కావడమేనన్నారు నందిని. చిన్నప్పుడు కర్లీ హెయిర్ వల్ల గట్టిగా జడలు వేస్తే నొప్పి వచ్చేదని, అందుకే వీలున్నప్పుడల్లా హెయిర్ కట్ చేయించుకునేదాన్నని తెలిపారు. డ్రెస్సింగ్ విషయానికొస్తే.. తనకు చిన్నతనం నుంచే షార్ట్స్ వేసుకోవడం అలవాటు అని చెప్పారు. పైగా డ్రెస్సింగ్ లో కంఫర్ట్ కోరుకుంటానని, అందుకే ఇప్పటికీ అలాంటి డ్రెస్సింగ్ స్టైలే మెయింటెయిన్ చేస్తున్నానన్నారు. కాగా.. తన 20'sలో మాత్రం చీరలు కట్టుకున్నానన్న నందిని.. దానిని క్యారీ చేసి నడవటం అంత కంఫర్ట్ గా అనిపించలేదన్నారు. ఎవరెన్ని ఖరీదైన బట్టలిచ్చినా తనకు కంఫర్ట్ అనిపించినవే వేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. తాను అబ్బాయిలా ఉండటానికి కారణాలివేనని నందినిరెడ్డి వెల్లడించారు.






