Anushka: సరోజ పాత్రకు కొనసాగింపుగా అనుష్కతో మూవీ చేయడానికి ట్రై చేశా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2025-09-02 16:52:07  IST  )

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటీ’.

Anushka: సరోజ పాత్రకు కొనసాగింపుగా అనుష్కతో మూవీ చేయడానికి ట్రై చేశా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటీ’. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క ఈ చిత్రంతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది ఈ చిత్రం. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్ ఇవ్వడంతో పాటు.. ఇంటర్వ్యూస్ పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఇందులో భాగంగానే అనుష్కపై డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ఘాటీ మూవీ.. నాయికి ప్రధానంగానే గానే పుట్టింది. వేదం తర్వాత స్వీటీ (అనుష్క)తో మరో సినిమా చేయాలని ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. సరోజ చాలా గొప్ప పాత్ర. ఆ పాత్రని కొనసాగించాలని ఆలోచన కూడా జరిగింది. అయితే ఆర్గానిక్‌గా ఉండే ఒక కథ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఘాటీ వచ్చింది. ఇందులో శీలావతి క్యారెక్టర్ అనుష్క గ్రేస్, యాటిట్యూడ్, సూపర్ స్టార్ డమ్‌కి పర్ఫెక్ట్ యాప్ట్. ఇది కమర్షియల్ యాక్షన్‌తో స్వీటీ కోసం చేసిన ఒక బిగ్ స్కేల్ మూవీ’ అంటూ తెలిపాడు క్రిష్ జాగర్లమూడి.

Next Story