సిల్క్ స్మిత అప్పటి పుష్ప.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

తన అందం, అభినయంతో భారతీయ సినీ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది అలనాటి అందాల నటి సిల్క్ స్మిత.

సిల్క్ స్మిత అప్పటి పుష్ప.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: తన అందం, అభినయంతో భారతీయ సినీ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది అలనాటి అందాల నటి సిల్క్ స్మిత. కేవలం ఐటెం సాంగ్స్, వ్యాంప్ పాత్రలతోనే స్టార్ హీరోలకు మించిన స్టార్డమ్‌ను సొంతం చేసుకున్న ఈ నటి అతి చిన్న వయసులో మరణించింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కనగల జయకుమార్ సిల్క్ స్మితకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సిల్క్ స్మిత కాలు మీద కాలు చేసుకుని స్టైల్‌గా కూర్చునేది. పెద్ద హీరోలు ఎవరు వచ్చిన సరే.. ఇది నా కాలే, ఇది కూడా కాలే.. నా కాలు మీద కాలు వేసుకుంటా అయితే ఏంటీ అన్నట్లు అలాగే కూర్చునేది. అప్పటి పుష్ప సిల్క్ స్మిత. నిజంగా పుష్పమే ఆ అమ్మాయి. ఆమె కళ్లు, ఫేస్‌లో ఉండే గ్లో.. ఫొటో గ్రఫిలో చూస్తే అసలు ఎంత అందంగా కనిపించేదో. ఆ అమ్మాయి కళ్లల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్‌కే పడిపోయారు అందరూ. పెద్ద నటి కాదు.. కానీ క్లోజప్‌లో తీస్తే చాలా అందంగా ఉండేది. కమల హాసన్‌తో తమిళంలో ఎన్ని సినిమాలు, ఎంత అద్భుతంగా తీసిందో’ అంటూ మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

Next Story