- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరిహరవీరమల్లు VFX కోసం రోజుకు 15గంటలు పనిచేశాం: డెరెక్టర్ జ్యోతి క్రిష్ణ
హరిహరవీరమల్లు సినిమా వీఎఫ్ఎక్స్ కోసం తమ వీఎఫ్ఎక్స్ టీం రోజుకు 15 గంటలు పనిచేసిందని దర్శకుడు జ్యోతి క్రిష్ణ అన్నారు. ఏడాది పాటు 4500 వీఎఫ్ఎక్స్ షాట్స్ తీసినట్టు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: హరిహరవీరమల్లు సినిమా వీఎఫ్ఎక్స్ కోసం తమ వీఎఫ్ఎక్స్ టీం రోజుకు 15 గంటలు పనిచేసిందని దర్శకుడు జ్యోతి క్రిష్ణ అన్నారు. ఏడాది పాటు 4500 వీఎఫ్ఎక్స్ షాట్స్ తీసినట్టు తెలిపారు. వాళ్ల కష్టం వల్లనే కేవలం ఏడాదిలో అన్నీ పూర్తి చేశామని చెప్పారు. కొందరు కావాలనే సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ ను ఎత్తిచూపుతూ నెగిటివిటీ తీసుకురావాలని చూస్తున్నారని కానీ ఒక్కరు కూడా కథపై, స్క్రీన్ ప్లే మరియు నటనపై విమర్శలు చేయకపోవడం తన అదృష్టం అని అన్నారు. క్రిష్ రాసుకున్న స్టోరీ కోహినూర్ చుట్టూ తిరిగే మాయాబజార్ లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా అని, కానీ షూటింగ్ కు ఎక్కువ బ్రేక్స్ రావడం వల్ల ఆ వర్షన్ పూర్తి చేయలేకపోయామని చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో త్రివిక్రమ్ తన అమూల్యమైన సమయాన్ని ఏమీ ఆశించకుండా తమ కోసం కేటాయించారని తెలిపారు. చాలా సార్లు ఆయన దిశానిర్దేశం చేశాడన్నారు. అందుకే ఆయన కోసం స్పెషల్ థాంక్స్ కార్డ్ వేయించినట్టు చెప్పారు.






