- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవతార్-3పై సూపర్ హింట్ ఇచ్చిన జేమ్స్ కామెరూన్.. ఆనందంలో ఫ్యాన్స్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణను పొందిన చిత్రాల్లో ‘అవతార్’(Avatar) ఒకటి.
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణను పొందిన చిత్రాల్లో ‘అవతార్’(Avatar) ఒకటి. జేమ్స్ కామెరూన్ (James Cameron)తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి సంచలన హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కొట్లల్లో వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా పార్ట్ 3 గురించి ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటికే పార్ట్ 3 కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘అవాతర్-3’(Avatar-3)పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మూవీపై మరింత ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘తెరపై ఈ విజువల్ వండర్‌ను చూసిన తర్వాత ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పార్ట్-3 ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. గత రెండు పార్టుల్లో చూపిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకుని.. వాటికి బదులుగా న్యూ వెర్షన్‌తో మీ ముందుకు వస్తాము. ఇలా ధైర్యం చేసి కొన్నింటిని సృష్టించకపోతే ప్రతిఒక్కరి సమయాన్ని, డబ్బును వేస్ట్ చేసినవాడిని అవుతాను. గత రెండు భాగాల్లో లేని అద్భుతాలను అవతార్-3 లో చూస్తారు. మరో కొత్త ప్రపంచం, భిన్నమైన కథనం, పాత్రలు ఇందులో కనిపిస్తాయి. మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్‌ని ఇందులో చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ జేమ్స్ కామెరూన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






