- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సీక్వెల్‌పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

దిశ, సినిమా: ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే వచ్చిన సీక్వెల్స్ ఘన విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు ఓ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. అమీషా పటేల్(Ameesha Patel ), సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘గదర్-2’(Gadar-2). అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2023లోవిడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, డైరెక్టర్ అనిల్ శర్మ(Anil Sharma) ‘వన్‌వాస్’(Vanvaas) ప్రమోషన్స్‌లో భాగంగా ‘గదర్-3’(Gadar-3) మూవీ రాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘గదర్-3 కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. నేను ‘వన్‌వాస్’(Vanvaas) చిత్రంతో బిజీగా ఉన్నాను. ఇది విడుదలైన తర్వాత ‘గదర్-3’ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాను. నేను నానా పటేకర్(Nana Patekar)తో ‘గదర్-3’ గురించి చర్చించాను. అతను కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావచ్చు. లేదంటే నానా పటేకర్ కోసం నేను ఓ స్పెషల్ రోల్ సృష్టించడానికి రెడీగా ఉన్నాను. త్వరలోనూ ‘గదర్-3’ సినిమాతో మీ ముందుకు వస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ శర్మ(Anil Sharma) కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.