- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan: ‘పెద్ది’ మూవీ ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్. ట్వీట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అనుకున్నంత రేంజ్‌లో ఈఆ మూవీ హిట్ అందుకోలేకపోయింది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అనుకున్నంత రేంజ్‌లో ఈఆ మూవీ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో ‘పెద్ది’(peddi) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్, రిద్ది సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar) కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. ఇందులో రామ్ చరణ్ కనిపించిన తీరు అందరిలో అంచనాలను పెంచేశాయి. ఓ బీడీ కాల్చుతూ.. గడ్డంతో ఉగ్ర రూపంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత మూవీ మేకర్స్ ‘పెద్ది’ ఫస్ట్ గ్లింప్స్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా రాబోతున్నట్లు వెల్లడించారు.
ఇక అప్పటినుంనుంచి రామ్ చరణం సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు గ్లింప్స్ విడుదలపై ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఏఆర్ రెహమాన్ మాస్ట్రోతో మిక్సింగ్ పూర్తి అయింది. ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ రేపు శ్రీరామ నవమి పండుగ నాడు ఉదయం 11.45 గంటలకు రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహామాన్‌తో కలిసి తీసుకున్న ఫొటోను నెట్టింట పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబు పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Mixing done ❤️🔥
— BuchiBabuSana (@BuchiBabuSana) April 4, 2025
Maestro @arrahman sir💥💥 🙏🙏🙏#PeddiFirstShot - Release Date Glimpse out on 6th April on the occasion of Sri Rama Navami at 11.45 AM ✨
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/4sSoF6xpPn






