Ahmedabad Flight crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో స్టార్ డైరెక్టర్ మృతి.. ఆలస్యంగా తెలిసిన నిజంతో షాక్‌లో సినీ ఇండస్ట్రీ

by Chukka Sudharani |

అహ్మదాబాద్‌ (Ahmedabad) ఘోర విమాన ప్రమాదం మొత్తం దేశాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Ahmedabad Flight crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో స్టార్ డైరెక్టర్ మృతి.. ఆలస్యంగా తెలిసిన నిజంతో షాక్‌లో సినీ ఇండస్ట్రీ
X

దిశ, సినిమా: అహ్మదాబాద్‌ (Ahmedabad) ఘోర విమాన ప్రమాదం మొత్తం దేశాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎయిరిండియాకు (Air India) చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం AI-171 అహ్మదాబాద్‌లోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్‌పై కుప్పకూలి 275 మంది మృతిచెందారు. ఈ ఘోర ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా చనిపోయారు. చనిపోయిన వారి మృతదేహాలు కూడా గుర్తుపట్టనివిధంగా చెల్లా చెదుకు అయిపోయాయి. దీంతో.. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా వారి కుటుంబాలకు మృతదేహాలను అందించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఈ దుర్ఘటనలో గుజరాతీకి చెందిన డైరెక్టర్ కమ్ నిర్మాత కూడా మరణించినట్లు తెలుస్తుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాతీ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ అల్బమ్‌లకు దర్శకునిగా, నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్ జిరావాలా. అయితే.. ఆయన విమాన ప్రమాదం జరిగిన నాటి నుంచి కనపించకుండా పోవడంతో.. ఆయన భార్య హేతల్ జిరావాలా తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యా్ప్తు చేయగా.. మహేష్ ఫోన్ చివరిసారిగా విమాన ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో సిగ్నల్ చూపించి ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయింది. ఇక మహేష్ జిరావాలా విమాన ప్రమాదంలో మృతి చెంది ఉంటారని అనుమానించిన పోలీసులు.. మహేష్ ఫ్యామిలీ నుంచి డీఎన్‌ఏ స్వీకరించారు. ఈ క్రమంలోనే ప్రమాద స్థలంలో లభించిన శరీర భాగాలతో మహేష్ ఫ్యామిలీ డీఎన్‌ఏ సరిపోలడంతో ఆయన మరణం అధికారికంగా నిర్ధారించబడింది. మొదట మహేష్ జిరావాలా మరణాన్ని కుటుంబ సభ్యులు నమ్మడానికి నిరాకరించినప్పటికీ.. పోలీసులు ఫోన్ నెంబర్, డీఎన్‌ఏ రిపోర్ట్‌తో సహా మరిన్ని ఆధారాలను సమర్పించి మృతదేహాన్ని అప్పగించారు. దీంతో గుజరాతీ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. మహేష్ మరణంతో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story