Akhanda2 Update: బోయపాటి వేట షురూ.. కృష్ణా నదిలో పడవపై సంచారం

by srinivas |
Akhanda2 Update: బోయపాటి వేట షురూ.. కృష్ణా నదిలో పడవపై సంచారం
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)-దర్శకుడు బోయపాటి శ్రీను(Director Boyapati Srinu) కాంబోలో ‘అఖండ-2’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసింది. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం దర్శకుడు లోకేషన్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. చిత్ర యూనిట్‌తో కలిసి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం గుడిమెట్లలో కృష్ణానది(Krishna River)లో పడవపై తిరుగుతున్నారు. షూటింగ్ స్పాట్‌లను పరిశీలిస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్‌ను చూసేందుకు కృష్ణా నది గట్టు మీద అభిమానులు భారీగా తరలివెళ్తున్నారు.

కాగా బాలయ్య ‘అఖండ’ (Akhanda) మూవీ ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసింది. బోయపాటి- బాలయ్య కాంబోలో అంతకుముందు వచ్చిన సింహా(Simha), లెజెండ్(Legend) మూవీలు కూడా బిగ్ హిట్ అయ్యారు. దీంతో వీరి కాంబో హ్యాట్రాక్ కొట్టింది. వరుస హ్యాట్రిక్‌పై కన్ను వేసిన బోయపాటి శ్రీను..ఈ మూడు సినిమాలను మించేలా ‘అఖండ-2’(Akhanda-2)ను తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లోకేషన్స్‌ను సెర్చింగ్ చేస్తున్నారు. డ్యుయెల్ రోల్‌లో తెరకెక్కిన ‘అఖండ’ మూవీలో పెద్ద బాలకృష్ణ అఘోరా(Aghora)గా కనిపించారు. ‘అఖండ-2’లోనూ అదే పాత్రలో కనిపించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ మూవీతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ‘అఖండ’ కొనసాగింపుగా ఈ మూవీ 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్యప్రదేశ్ మహాకుంభ మేళా(Madhya Pradesh Mahakumbha Mela) సందర్భంగా ‘అఖండ-2’ షూటింగ్ ప్రారంభమయింది. కొత్త షెడ్యూల్ కోసం లోకేషన్స్‌ను దర్శకుడు బోయపాటి వెతుకుతున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ ‌నెలలో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed