- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు సినిమా ఒక సాంస్కృతిక సంపదను కోల్పోయింది: డైరెక్టర్ బందూక్ లక్ష్మణ్
బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ సినీ గేయ రచయిత, కథ రచయిత, దర్శకులు శివశక్తిదత్త మృతిపట్ల డైరెక్టర్ బందూక్ లక్ష్మణ్ సంతాపం తెలిపారు. తాను సినిమా పరిశ్రమలోకి వస్తున్న రోజుల్లో పరిచయమైన గొప్ప వ్యక్తి శివశక్తిదత్త అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ సినీ గేయ రచయిత, కథ రచయిత, దర్శకులు శివశక్తిదత్త మృతిపట్ల డైరెక్టర్ బందూక్ లక్ష్మణ్ సంతాపం తెలిపారు. తాను సినిమా పరిశ్రమలోకి వస్తున్న రోజుల్లో పరిచయమైన గొప్ప వ్యక్తి శివశక్తిదత్త అన్నారు. ఆయనతో సాహిత్యం గురు శిష్యుల బంధం, సామాజిక అంశాలపై సినిమా అనే తన దృక్పదానికి చాలా చాలా విషయాలు నేర్పించారన్నారు. అందరికీ తెలిసినట్లు ఆయన రచయిత, దర్శకులే కాకుండా గొప్ప చిత్ర కళాకారుడని చెప్పారు. ఆయన స్వయంగా వేసిన ఆయిల్ పెయింటింగ్స్ ను ప్రదర్శన చేయించే భాగ్యం తనకు కలిగిందన్నారు. 2012 సంవత్సరంలో శివశక్తి దత్త గీసిన పెయింటింగ్ ప్రదర్శన కార్యక్రమంలో క్రియశీలకంగా పని చేసినట్టు తెలిపారు.
అప్పుడే SS. రాజమౌళికి, రాఘవేంద్రరావుకు ప్రముఖులందరికీ పరిచయం చేశారన్నారు. ఆ తర్వాత తమ ప్రయాణం చాలా చాలా భావోద్వేగంగా ఉండేదని చెప్పారు. ఆయన తన ఇంటికి వచ్చే వారని, ఇంట్లో రోజంతా సరదాగా గడిపేవారన్నారు. ఆయన పుట్టిన రోజు కూడా అందరూ కలిసి సెలబ్రేట్ చేసేవాళ్లమని చెప్పారు. ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ ఒకటైతే సినిమా కథల పైన ఆయన పరిజ్ఞానం అమోఘం అని తెలిపారు. తనకు సినిమా కథ రాసే విధానాన్ని నేర్పించారని, తెలుగు గ్రామర్, తెలుగు సాహిత్యం పైన ఒక కొత్త విధానాన్ని పరిచయం చేశారన్నారు. తన జీవితంలో లభించిన అపురూమైన జ్ఞాపకం శివశక్తి పరిచయం అన్నారు. ఆయన అందరినీ వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరం అని చెప్పారు. తెలుగు సినిమా ఒక సాంస్కృతిక సంపదను కోల్పోయిందన్నారు.






