- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి సలహాలు.. నో చెప్పిన దర్శకుడు అనిల్..!
మెగాస్టార్ చిరంజీవి లుక్స్ పై దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్‌గారు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తుండగా నయన తార హీరోయిన్ గా మెరుస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు దర్శకుడు అనిల్. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. ఆయన పాత్ర 20 నిమిషాలు ఉంటుందని టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి లుక్స్ పై దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మన శంకర వరప్రసాద్‌గారు సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ప్రయత్నిస్తానన్నారని అనిల్ వెల్లడించారు. కానీ ఆ లుక్ వద్దని తానే చెప్పినట్లు తాజాగా వెల్లడించారు. ఆయన బయట ఎలా ఉన్నారో, సినిమాలో కూడా అలానే చూపించడానికి చాలా ట్రై చేశానని స్పష్టం చేశారు. ఇది విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి కూడా చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. 20 సంవత్సరాల కిందట చిరంజీవి స్లిమ్ గా ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఆయన అలాగే ఉన్నారని ప్రశంసించారు. దీంతో అనిల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.






