- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sankranthiki Vasthunnam: ఈ మూవీ విషయంలో మా బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్ ఇదే.. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు
సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాతికి వస్తున్నాం చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయింది. మూవీ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో వెంకటేష్(Venkatesh) కథానాయకుడిగా నటించగా.. మీనాక్షి(Meenakshi), ఐశ్వర్య(Aishwarya) కథానాయకులుగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేశారు. అయితే తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించగా.. సంక్రాంతి నటీనటులంతా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫస్ట్ షోను మహిళా ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్‌కు వెళ్లి చూడటమే మా బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్ అని వెల్లడించారు.
ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీ తొలి షో చూడాలని కోరుకున్నామని వెల్లడించారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఆదరించిన ప్రతీ ఒక్కరికీ టీమ్ కృతజ్జతలు తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో థియేటర్ కు రారులే అనుకున్నా కానీ.. థియేటర్‌కు వెళ్లి చూడగా.. నిజంగా ఆశ్చర్యపోయానంటూ దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) తెలిపారు. నేను ఊహించిందాని కంటే ఎక్కువ మందే వచ్చారని.. అంతేకాకుండా వారంతా నన్ను పలకరిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందని హ్యాపీ కామెంట్స్ చేశారు. సంక్రాంతికి వచ్చిన సంక్రాంతి వస్తున్నాం చిత్రాన్ని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని అనిల్ రావిపూడి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.






