- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మిస్టీరియస్’ క్లైమాక్స్ గురించే చర్చ
‘మిస్టీరియస్’ సినిమాను రెగ్యులర్ ఫార్మాట్‌తో కాకుండా.. విభిన్నమైన పాయింట్‌తో తెరకెక్కించామని తెలిపారు ఆ చిత్ర దర్శకుడు మహి కోమటిరెడ్డి. ఈ సినిమాలో క్రైమ్‌తో పాటు లవ్, క్రష్ ఉంటాయని.. థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉంటాయని

దిశ, సినిమా : ‘మిస్టీరియస్’ సినిమాను రెగ్యులర్ ఫార్మాట్‌తో కాకుండా.. విభిన్నమైన పాయింట్‌తో తెరకెక్కించామని తెలిపారు ఆ చిత్ర దర్శకుడు మహి కోమటిరెడ్డి. ఈ సినిమాలో క్రైమ్‌తో పాటు లవ్, క్రష్ ఉంటాయని.. థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉంటాయని.. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్ అవుతారని తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలను ఏ సినిమాలోనూ చూపించలేదన్నారు. కిల్లర్ ఎవరు అనేది చివరి వరకు సస్పెన్స్‌గానే సాగుతుందని.. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరూ ఊహించని విధమైన ఓ ట్విస్ట్‌తో సస్పెన్స్ ప్లస్ థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. సినిమా అయిపోయక అందరూ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునేలా ఉండబోతుందని చెప్పారు. థ్రిలర్ మూవీస్ అంటే.. పాటలు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు కానీ తమ సినిమాలో కథను బట్టి మూడు పాటలు పెట్టడం జరిగిందన్నారు. ఈ మూడు పాటలు కూడా సరిగ్గా సరిపోయాయని.. ప్రేక్షకుడు మొత్తం క్రైమ్ సినిమానే చూస్తున్నాడు అనే ఫీల్ రాకుండా.. ప్రేక్షకుడు డిస్టర్బ్ అవ్వకుండా.. మధ్యలో వచ్చే పాటలు కూడా మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయన్నారు. ఆ పాటలకు తమ సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా ఛాట్ బస్టర్ మ్యూజిక్ అందించారన్న ఆయన.. పోలీసుల గొప్పదనం చెప్పేలా రూపొందించిన ‘అడుగు అడుగునా’ సాంగ్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో రిలీజ్ చేయించామన్నారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని.. పాటలతో పాటు ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందన్న ఆయన.. ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. ‘అఖండ 2’ రిలీజ్ కారణంగా ఒక వారం ఆలస్యంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు. 150 థియేటర్స్‌కు పైగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామని.. ఈ మధ్యే మా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుపుకున్నామని తెలిపారు.






