అతనితో మ్యారేజ్ వార్తలపై స్పందించిన డింపుల్ హయాతి..

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-20 05:19:34  IST  )

మాస్ మహారాజా రవితేజ(Raviteja) నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bharta Maha Shayulaku Vignapthi) సినిమా థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

అతనితో మ్యారేజ్ వార్తలపై స్పందించిన డింపుల్ హయాతి..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ(Raviteja) నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bharta Maha Shayulaku Vignapthi) సినిమా థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక దీనికి దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అయితే, డింపుల్ హయితికి డేవిడ్ అనే వ్యక్తితో గతంలోనే రహస్యంగా మ్యారేజ్ జరిగిందని, వారిద్దరూ ఇప్పటికీ కలిసే ఉంటున్నారని నెట్టింట ఓ పుకారు షికారు చేస్తుంది.

ఈ నేపథ్యంలో తాజాగా డింపుల్ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె సోషల్ మీడియాలో స్పందించింది. ఇందులో భాగంగా ఒక అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. ‘గతంలోనే నాకు పెళ్లి అయింది అని వార్తలు వచ్చాయి. నిజానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను సృష్టించవద్దు, నమ్మవద్దు’ అని డింపుల్ హయాతి ఘాటుగా ఆన్సర్ చేసింది. ప్రస్తుతం డింపుల్ హయాతి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story