- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ-2' రివ్యూ చెప్పిన దిల్ రాజు.. అదే హైలెట్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 సినిమా గురువారం విడుదలైంది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూసేందుకు వెళుతున్నారు. అభిమానులతో పాటు సినీతారలు,

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 సినిమా గురువారం విడుదలైంది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూసేందుకు వెళుతున్నారు. అభిమానులతో పాటు సినీతారలు, ఇండస్ట్రీకి చెందినవాళ్లు సైతం అఖండ సినిమా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన భార్యతో కలిసి సినిమాకు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రివ్యూ చెప్పారు. సినిమా చాలా బాగుందని, యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయని అన్నారు.
అఖండ క్యారెక్టర్ సూపర్బ్ గా ఉందని, ఇంటర్వెల్ ఎపిసోడ్ మైండ్ బ్లాయింగ్ అని చెప్పారు. దిల్ రాజు సతీమణి తేజస్వి కూడా సినిమా బాగుందని అన్నారు. అయితే సినిమాకు మొత్తంగా చూస్తే మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా తమన్ స్వరాలు సమకూర్చారు. అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది వరకే సినిమా విడుదల కావాల్సి ఉండగా నిర్మాణ సంస్థల మధ్య ఇష్యూ కారణంగా విడుదల వాయిదా పడి గురువారం విడుదలైంది.
Read More..






