ఆ బాధ్యత మన మీదే ఉంది.. సినీ ప్రముఖులకు దిల్ రాజు కీలక పిలుపు

by Gantepaka Srikanth |

హైటెక్స్​వేదికగా శనివారం తెలంగాణ గద్దర్​ఫిల్మ్​అవార్డ్​వేడుక ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆ బాధ్యత మన మీదే ఉంది.. సినీ ప్రముఖులకు దిల్ రాజు కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైటెక్స్​వేదికగా శనివారం తెలంగాణ గద్దర్​ఫిల్మ్​అవార్డ్​వేడుక ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​రెడ్డి, పలువురు మంత్రులు హాజరు అవుతుండగా, తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ “ఈ నెల 14న హైటెక్స్‌ వేదికగా తెలంగాణ గద్దరు అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. 14 సంవత్సరాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం చేయాలసిన బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉంది. నేటి ఈ కార్యక్రమానికి ఐ అండ్‌ పీఆర్‌ ద్వారా లైవ్‌ ప్రసారం కానుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్‌ అందరికీ రీచ్‌ అవ్వాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి ఈ వేడుకలో అవార్డులు అందిస్తున్నాం. ప్రతి సంవత్సరానికి సంబంధించి ఎంపికైన మూడు ఉత్తమ చిత్రాలకు పనిచేసిన హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలకు అవార్డులు అందిస్తున్నాం. ఇలాంటి ఓ మంచి సాంప్రదాయాన్ని గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల పేరిట ఇస్తున్నాం. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. 14 సంవత్సరాల తరువాత జరుగుతున్న ఈ వేడుకను తెలుగు సినీ పరిశ్రమలోని అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Next Story