దిల్ రాజు టార్గెట్ 2026.. ఒకే ఏడాది ఆరు సినిమాలు

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు వ‌చ్చే ఏడాది ఆరు సినిమాలు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు నిర్మాత శిరీష్ వెల్ల‌డించారు. గోవాలో జ‌రిగిన ఐఎఫ్ఎఫ్ఐ సినిమా ఫంక్ష‌న్ లో శిరీష్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అందులో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు క్లారిటీ ఇచ్చారు

దిల్ రాజు టార్గెట్ 2026.. ఒకే ఏడాది ఆరు సినిమాలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు వ‌చ్చే ఏడాది ఆరు సినిమాలు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు నిర్మాత శిరీష్ వెల్ల‌డించారు. గోవాలో జ‌రిగిన ఐఎఫ్ఎఫ్ఐ సినిమా ఫంక్ష‌న్ లో శిరీష్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అందులో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఇప్ప‌టికే సినిమా ఖ‌రారు అయిన‌ట్టు వెల్ల‌డించారు. అంతేకాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ తో కూడా ఓ సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

వీటితో పాటు సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాను బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ తో రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. శిరీష్ చేసిన ప్రకటనతో మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. దిల్ రాజు బ్యానర్ నుండి బాలీవుడ్ సినిమాలు సైతం ప్రకటించడంపై కుషీ అవుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ తో కూడా ఓ సినిమా ఉందని చెప్పడంతో పవర్ స్టార్ అభిమానులు సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి వచ్చే ఏడాది రాబోతున్న ఈ ఆరు సినిమాల్లో ఎన్ని హిట్ కొడతాయో ఎన్ని ఫ్లాప్ అవుతాయో చూడాలి.

Next Story