- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్- ప్రశాంత్ నీల్ 'రావణం'పై ఆ గాసిప్స్.. స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక అప్పట్లో ప్రభాస్- ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో రావణం అనే మూవీ తెరకెక్కుతోందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా డైరెక్టర్, హీరో మారిపోయారని కొన్ని గాసిప్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్‌రాజు(Dil Raju) ఈ పుకార్ల పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రావణం సినిమా పక్కా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనే ఉంటుంది.
ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్ పార్ట్-2’(Salar-2) అలాగే ఎన్టీఆర్(NTR) గారితో చేసే యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ రెండు పూర్తయిన వెంటనే, రావణం సెట్స్ పైకి వస్తుంది. ఇది పెద్ద బడ్జెట్, భారీ కథా నేపథ్యం కలిగిన సినిమా. అందుకే కొంత టైమ్ పడుతుంది. కానీ ప్రభాస్‌తోనే, ప్రశాంత్ నీల్‌తోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. Link






