శ్రీ తేజ్ వ్యవహారంపై దిల్ రాజు కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |   (  Updated:2025-12-04 12:37:27  IST  )

సంధ్య థియేటర్ శ్రీ తేజ వ్యవహారంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ దిల్ రాజు స్పందించారు.

శ్రీ తేజ్ వ్యవహారంపై దిల్ రాజు కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సంధ్య థియేటర్ శ్రీ తేజ్ వ్యవహారంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ దిల్ రాజు స్పందించారు. ఇవాళ ఉద‌యం నుంచి శ్రీ తేజ్ ఆరోగ్యంపై అనేక ర‌కాల వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అత‌ని వైద్యానికి డ‌బ్బులు అంద‌డం లేద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ త‌రుణంలోనే స్వ‌యంగా నిర్మాత దిల్ రాజ్, ఈ అంశంపై వెంట‌నే రియాక్ట్ అయ్యారు. శ్రీ తేజ్ ను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని అత‌ని తండ్రి స‌మ‌క్షంలో ప్ర‌క‌టించారు.

ఇప్పటికే రెండు కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేసిన‌ట్లు వివ‌రించారు. వడ్డీ రూపంలో వస్తున్న డబ్బులను ప్రతినెల శ్రీ తేజ్ తండ్రికి వచ్చేలా చేసామ‌ని ప్ర‌క‌టించారు. ఆస్పత్రిలో దాదాపు 70 లక్షల రూపాయలు క‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. రిహాబిలిటేషన్ కేంద్రంలో అయ్యే ఖర్చును కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారని గుర్తు చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగా కుదుటపడుతోందన్నారు.

అటు ఈ అంశంపై శ్రీ తేజ్ తండ్రి మాట్లాడారు. అల్లు అర్జున్ టీం చాలా వరకు బాగా రెస్పాండ్ అయిందన్నారు. ఇప్పటి వరకు అన్ని విధాల అల్లు టీం మమ్మల్ని ఆదుకుందని ప్ర‌క‌టించారు. మరికొంత ఆర్థిక సహాయం అవసరం ఉందన్నారు. అన్ని విషయాలు దిల్ రాజుతో మాట్లాడిన‌ట్లు తెలిపారు. దిల్ రాజు కూడా అన్ని విధాల సహాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.

Next Story