రామ్ చరణ్ తో బ్లాక్ బస్టర్ తీసి తీరుతా - దిల్ రాజ్

by velandi.Saikiran |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood) అగ్రశ్రే

రామ్ చరణ్ తో బ్లాక్ బస్టర్ తీసి తీరుతా - దిల్ రాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood) అగ్రశ్రేణి హీరోగా రామ్ చరణ్ కొనసాగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని రామ్ చరణ్.. ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రాంచరణ్. అయితే అలాంటి హీరో రామ్ చరణ్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రామ్ చరణ్ తో సూపర్ హిట్ సినిమా చేయలేకపోయామని వెలితి ఉందని నిర్మాత దిల్ రాజు తాజాగా పేర్కొన్నారు. ఆయనతో సూపర్ హిట్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని వివరించారు. తమ్ముడు సినిమా ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. ఇది ఇలా ఉండగా నిర్మాత దిల్ రాజు అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ అన్న సంగతి తెలిసిందే. మొన్నటి సంక్రాంతికి.. ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా పెద్ద హిట్ కాలేదు. దింతో రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

Next Story