హోటల్‌లో ప్రియురాలిని ఆ విధంగా హింసించిన ప్రముఖ సింగర్.. కిందపడ్డా వదల్లే.. (వీడియో)

by Sujitha Rachapalli |

మ్యూజిక్ మొగల్ సీన్ ‘డిడ్డీ’ కాంబ్స్ వ్యభిచారం, సెక్స్ ట్రాఫికింగ్, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కానీ తాజాగా రాకెట్టీరింగ్, సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణల నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు. దీంతో భారీ నిరసనలు వెల్లువెత్తాయి

హోటల్‌లో ప్రియురాలిని ఆ విధంగా హింసించిన ప్రముఖ సింగర్.. కిందపడ్డా వదల్లే.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యూజిక్ మొగల్ సీన్ ‘డిడ్డీ’ కాంబ్స్ వ్యభిచారం, సెక్స్ ట్రాఫికింగ్, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కానీ తాజాగా రాకెట్టీరింగ్, సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణల నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు. దీంతో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఎలా నిర్దోషిగా బయటపడుతున్నాడనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో మార్చి 2016లో ఒక హోటల్ హాల్వేలో తన గర్ల్ ఫ్రెండ్ కాసీ వెంటురాపై దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. దారుణంగా హింసించిన వీడియో ట్రెండ్ అవుతోంది.

సీసీటీవీ ఫుటేజీలో కాంబ్స్ వాయిలెన్స్ దారుణంగా ఉంది. ఒక టవల్ మాత్రమే ధరించిన ఆయన.. కోపంతో ఊగిపోతూ వెంటురాను హాల్వేలో వెంటాడి పట్టుకుని, కిందకు తోసి తన్నుతూ, కొడుతూ మళ్లీ రూమ్ వైపు లాక్కుపోయినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పబ్లిక్ హోటల్‌లోనే ఇలా ఉంటే ప్రైవేట్‌గా ఎంత దారుణంగా ఉంటాడో అంటున్నారు. 1991 నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. తనను లోపలేస్తే వీళ్లు ఏమైపోతారోననే భయం నాయకుల్లో ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

VIDEO

Next Story