తెలుగోళ్లు అంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్.. ఐకాన్ స్టార్ మాస్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-06 07:46:12  IST  )

అమెరికా వేదికగా జరిగిన ‘నాట్స్‌ 2025’ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) పాల్గొన్నారు.

తెలుగోళ్లు అంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్.. ఐకాన్ స్టార్ మాస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వేదికగా జరిగిన ‘నాట్స్‌ 2025’ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) పాల్గొన్నారు. ఇక అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని ఉద్దేశించి ‘పుష్ప’(Pushpa) సినిమా పద్ధతిలో హీరో అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు వారంటే ఫైర్‌ అనుకున్నారా.. వైల్డ్‌ ఫైర్‌’ అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తాను. ఎప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్చర్యానికి గురవుతుంటా. ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అమెరికాలో మనమంతా ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నా.

నన్ను ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నాట్స్‌కు ధన్యవాదాలు. నాట్స్‌ గురించి సరదాగా ‘పుష్ప’ స్టైల్‌లో చెప్పాలంటే ‘నాట్స్‌ అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌’. మన తెలుగు కల్చర్‌ను ముందు తరాలకు తీసుకువెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులోనూ తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే ” అని అల్లు అర్జున్‌ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. Link

Next Story