Vadde Naveen: వడ్డే నవీన్ ఆ స్టార్ హీరో బావ‌ అని మీకు తెలుసా..?

by Prasanna |   ( Updated:2025-02-15 09:25:35.0  )
Vadde Naveen: వడ్డే నవీన్ ఆ స్టార్ హీరో బావ‌ అని మీకు తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్ ( Vadde Naveen ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత లవ్ సినిమాలు వదిలేసి ఫ్యామిలీ మూవీస్ చేయడం మొదలుపెట్టాడు. " కోరుకున్న ప్రియుడు " అనే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు రావడంతో ఎక్కడా తగ్గకుండా కొత్త ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళాడు. దీంతో నవీన్ కు చాలా ఆఫర్లు వచ్చాయి.

వడ్డే నవీన్ ఎవరో కాదు, నిర్మాత రమేష్ కొడుకు. సినిమాలపై ఆసక్తి ఉండటంతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. అలా తక్కువ సమయంలోనే పాపులర్ అయి అంతే స్పీడుగా కనిపించకుండాపోయాడు. అయితే, నవీన్ తన రియల్ లైఫ్ లో నందమూరి కుటుంబానికి అల్లుడనే సంగతి చాలా మందికి తెలియదు. ఎన్టీ రామారావు కొడుకుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణ కూతురును పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ సంబంధం కుదరడానికి ప్రత్యేక కారణం ఎన్టీఆర్ అట. వీరిద్దరూ ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళట.

అయితే, పెళ్లికి ముందే నవీన్ ఆమెతో లవ్ లో ఉన్నారని, ఆ తర్వాత ఎన్టీఆర్ వలనే మ్యాచ్ ఫిక్స్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. ఇలా మొత్తానికి నందమూరి ఇంటికి అల్లుడయ్యారు నవీన్.. దీంతో ఎన్టీఆర్ కు బావ అయిపోయారు.. అలా కొద్ది రోజులు వారు బాగానే ఉన్నారు. అయితే, కానీ కొన్ని కారణాలవల్ల నవీన్ తన భార్యకు డివోర్స్ ఇచ్చారు. ఇక, అక్కడితో చుట్టరికం తెగిపోయిన నందమూరి హీరోలతో నవీన్ స్నేహంగానే ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఆమెకి విడాకులు ఇచ్చిన తర్వాత నవీన్ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉన్నారు.

Next Story