సమంత చైతూ కంటే ముందే ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడిందా.. బెడ్ రూంలో..?

by Hamsa |
సమంత చైతూ కంటే ముందే ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడిందా.. బెడ్ రూంలో..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని స్టార్ డమ్ తెచ్చుకుంది. ‘ఏ మాయ చేసావే’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు లక్కీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఏవో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయింది. అయితే అప్పటి నుంచి సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారుతూనే ఉన్నాయి.

తాజాగా, సామ్, చైతూ కంటే ముందే ఓ స్టార్‌హీరో ప్రేమలో పడిందట. ఇక ఆ హీరో ఎవరో కాదు తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్ చేసే టైం లోనే సమంతకి రజినీకాంత్ అంటే పిచ్చి ఇష్టమట. ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయనకు సంబంధించిన ప్రతి సినిమా పోస్టర్ తన ఇంట్లో గోడలకు అంటించుకునేదట సమంత. ఇంట్లో మాత్రమే కాకుండా బెడ్ రూమ్‌లో రజినీకాంత్‌కి సంబంధించిన ఫొటోలు పెట్టుకునేదట. అయితే ఈ ప్రేమ ఒక విధమైన ఆరాధన లాంటిది. ఎలా అంటే.. దేవుడి మీద భక్తులకు ఎలా అయితే అభిమానం, ప్రేమ ఉంటాయో అలాగే రజనీకాంత్ అంటే కూడా సమంతకి అలాంటి ప్రేమే ఉండేదట. అలా సినిమాల్లోకి రాకముందే రజినీకాంత్‌ను సామ్ ప్రేమించిదట. ఇండస్ట్రీకి వచ్చాక ఒక్కసారైనా ఆయనతో నటించాలని అనుకున్నా ఆమె కోరిక ఇప్పటికి నెరవేరలేదట. ప్రస్తుతం సమంత ప్రేమకు సంబంధించిన ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Next Story

Most Viewed