ఏంటి మృణాల్ ఠాకూర్ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందా..? నెట్టింట సెన్సేషనల్‌గా మారిన వీడియో..!

by Gugulothu.Kavitha |

‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఏంటి మృణాల్ ఠాకూర్ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందా..? నెట్టింట సెన్సేషనల్‌గా మారిన వీడియో..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. అలాగే తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్(Adivishesh) హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’(Decoit) మూవీతో పాటు, బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉంటుంది. మరోపక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ తన గ్లామర్‌తో అండ్ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో గత్తరలేపుతుంది.

అయితే తాజాగా మృణాల్ పోస్ట్ చేసిన స్టోరీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఓ వీడియో షేర్ చేస్తూ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నీ పిల్లికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది’ అని రాసుకొచ్చింది. అయితే ఆ వీడియోలో పెళ్లి కూతురిలా చేతికి మెహందీతో పాటు చేతినిండా గాజులు వేసుకుంది. అయితే ఆ హ్యాండ్స్ ఎవరివో తెలియట్లేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. ఆమె ఫ్యాన్స్ మృణాల్ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.


Next Story