త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ధురంధర్-2 నటుడు?

by velandi.Saikiran |

త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ధురంధర్-2 నటుడు ఉద‌య్ వీర్ సంధును తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ధురంధర్-2 నటుడు?
X

దిశ‌, వెబ్ డెస్క్: ధురంధర్ 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా, కోట్లల్లో కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. దీంతో ధురంధర్ 2 సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ సినిమాలో నటించిన వాళ్లకు కూడా ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే రణ్ వీర్‌ సింగ్ స్నేహితుడిగా ఈ మూవీలో మెరిసిన ఉదయ్ వీర్ సంధుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ ఉదయ్ వీర్ సంధును టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బిగ్ స్కెచ్ వేసినట్లు టాక్ నడుస్తోంది.

వెంకీ మామ సినిమాలో విలన్ గా ఉదయ్ వీర్ ?

త్రివిక్రమ్, వెంకీ మామ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకు ఉదయ్ వీర్ సంధును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దురంధర్ 2 సినిమాలో నటుడు ఉదయ్ కొద్దిసేపు కనిపించినప్పటికీ, అందరినీ ఆకట్టుకున్నాడు. అంతకుముందు అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాలో కూడా మెరిశాడు. అయితే ఇతని నటన నచ్చిన నేపథ్యంలో తెలుగులోకి తీసుకువచ్చేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండ‌గా, ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి కానుక‌గా ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Next Story