- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు క్రైమ్ థ్రిల్లర్‌ను ఇష్టపడితే.. ఆహాలో ఈ మూవీ చూసేయండి!!
సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఈ సిరీస్ లో

దిశ, సినిమా : సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' సిరీస్ అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్‌కు జెస్విని దర్శకత్వం వహించారు. అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, గురు, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సిరీస్ కు అశ్వతన్ మ్యూజిక్ అందించారు. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరిగితే ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేది ఈ సిరీస్ లో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. నగరంలో ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేస్ సాల్వ్ చేసేందుకు రంగంలోకి దిగిన ఏసీపీ అశ్విన్ నేరస్తులను పట్టుకున్నాడా లేదా ఈ కేసుల విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' సిరీస్ లో చూడాలి.






