‘కంగువా’ దర్శకుడితో ధనుష్ నెక్స్ట్ మూవీ?

by Pulgam srinivas |

అన్నీ కుదిరితే ధనుష్–శివ కాంబోలో కొత్త సినిమా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

‘కంగువా’ దర్శకుడితో ధనుష్ నెక్స్ట్ మూవీ?
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీబిజీగా సమయాన్ని గడిపే హీరోలలో ధనుష్ ఒకరు. ఒకేసారి రెండు, మూడు సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటూ తన కెరీర్‌ను వేగంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా పలు సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ ‘కర’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పరవాలేదనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు ధనుష్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కంగువ’ చిత్ర దర్శకుడు శివతో ధనుష్ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం శివ చెప్పిన కథ ధనుష్‌కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌పై ఇద్దరి మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, అన్నీ సెట్ అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Next Story