Kubera: ధనుష్ ‘కుబేర’ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |

ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’.

Kubera: ధనుష్ ‘కుబేర’ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ సంస్థపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ‘కుబేర’ రిలీజ్ వాయిదా పడబోతున్నట్లు తమిళ మీడియా వర్గాల నుంచి సమాచారం. ఈ మేరకు ‘కుబేర’ సినిమా వాయిదా పడుతున్నట్లు జూలై నెలలో విడుదల ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, వాయిదాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

Next Story