Dhanush : ‘ఎన్న సుగం..’ అంటూ ఫస్ట్ సింగిల్‌ విడుదల చేసిన మేకర్స్

by Bhanu |

తమిళ స్టార్ హీరో ధనుష్, తాజాగా తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’) పై ఆసక్తి పెరుగుతోంది.

Dhanush : ‘ఎన్న సుగం..’ అంటూ ఫస్ట్ సింగిల్‌ విడుదల చేసిన మేకర్స్
X

Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్, తాజాగా తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’) పై ఆసక్తి పెరుగుతోంది. మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే ప్రకాశ్ రాజ్, శాలిని పాండే, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ‘ఎన్న సుగం..’ సంగీతాభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ప్రేమపూరిత గీతంలో నిత్యామీనన్ తన ప్రేమికుడిపై చూపే అభిమానం, ఆరాధన, ఆమె మనసు కోణాన్ని హృద్యంగా చూపించారు. “నువ్వు నా భాగస్వామి అయితే.. ఆ గుడిసె గుడిలా మారుతుంద” అనే లైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ మెలోడియస్ సాంగ్‌కు సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్, గీతాన్ని ధనుష్ స్వయంగా ఆలపించారు. అతనితో పాటే శ్వేతా మోహన్ కూడా పాటలో భాగమయ్యారు. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ పాట ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. డాన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ పాట ద్వారా సినిమా టోన్, భావోద్వేగాల తీవ్రత స్పష్టమవుతుండటంతో, అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది.


https://youtu.be/I5EtG8ZTgKU?si=iMiya9CVdGz7wjO_

Next Story