- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ ‘RT-77’కు డివోషనల్ టైటిల్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్
హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) ప్రజెంట్ నటిస్తున్న తాజా సినిమా ‘RT-77’(వర్కింగ్ టైటిల్).

దిశ, వెబ్‌డెస్క్: హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) ప్రజెంట్ నటిస్తున్న తాజా సినిమా ‘RT-77’(వర్కింగ్ టైటిల్). శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్, పాప ఎమోషన్స్ తో పాటు బలమైన యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కనుందట. అయితే నేడు రవితేజ బర్త్‌డే సందర్బంగా ఈ మూవీకు ఓ డివోషనల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు మూవీ టీమ్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ..‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మిమ్మల్ని ఎంచుకుంటాయి.
మళ్ళీ అలాంటి కథలో భాగం కావడం, నమ్మకాన్ని నడిపించడం అదృష్టంగా భావిస్తున్నాను.. ఇరుముడి అనే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను’ అని రాసుకొస్తూ ఈ చిత్రానికి ఇరుముడి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఇక పోస్టర్‌లో రవితేజ స్వామి మాలలో ఓ చేతితో పాపను ఎత్తుకొని మరో చేత్తో ఇరుముడిని పట్టుకున్నాడు. ఇక అతని చుట్టూ అందరూ అయ్యప్ప స్వాములు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నది.






