Pawan Kalyan: వేరే లెవల్ బ్లాక్ బస్టర్ కన్ఫార్మ్.. పవన్ కల్యాణ్ సినిమాపై దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్

by Chukka Sudharani |

పవర్ స్టార్ ఫ్యాన్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి.

Pawan Kalyan: వేరే లెవల్ బ్లాక్ బస్టర్ కన్ఫార్మ్.. పవన్ కల్యాణ్ సినిమాపై దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ ఫ్యాన్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) ఒకటి. పవన్ కల్యాన్, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై దేవిశ్రీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

చాలా రోజుల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కల్యాణ్‌తో కొలబ్రేట్ అవుతున్నారు.. ఎలాం ఉండబోతుంది అనే ప్రశ్నకు.. ‘ఉస్తాద్‌లో ఆయన అంటారు కదా.. ఈసారి పర్పామెన్స్ బద్దలైపోద్ది అని.. అదే రేంజ్‌లో సూపర్‌గా వచ్చింది. మొన్న ఒక సాంగ్ షూట్ చేశాము. సూపర్ సూపర్‌గా పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేశారు. ఆయన అయితే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి అదరకొట్టేసావు దేవి. చాలా కాలం తర్వాత నాకు మళ్లీ డ్యాన్స్ చెయ్యాలి అనిపించేలా చేశావు. నాతో డ్యాన్స్ చేపించేస్తున్నావు అన్నారు. అది వినగానే నాకు రెక్కలు వచ్చినట్లు అనిపించి. కచ్చితంగా ఈ సాంగ్ అండ్ ఇందులో డ్యాన్స్ అందరికి నచ్చుతుంది. హరీష్ శంకర్ అయితే వేరే లెవల్ బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైన్మెంట్‌గా దాన్ని మలుస్తున్నారు.

Next Story